హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): నిమ్స్ పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్ ఆర్వీకుమార్కు అరుదైన గౌరవం దకింది. చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల విభాగంలో రెండేండ్ల ఫెలోషిప్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ భావిస్తున్నది. దీనికోసం నియమ నిబంధనల రూపకల్పనకు దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఆర్వీకుమార్కు చోటు దకింది.