Big Boss | ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్ నిలవగా, రన్నరప్ గా గౌతం నిలిచాడు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్లోబల్ స్టార్ రాం చరణ్.. విజేత నిఖిల్ కు ట్రోఫీతోపాటు రూ.54 లక్షల నగదు బహుమతి, మారుతి సుజుకి డిజైర్ కారు అందజేశారు. వంద రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను ఆనందింప జేసిన బిగ్ బాస్- 8 కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నారు.