నిడమనూరు, డిసెంబర్ 1: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల నేపథ్యంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దొడ్డా ఆంజనేయులు ను సస్పెండ్ చేస్తూ డీఈఓ భిక్షపతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులు మూడ్రోజుల క్రితం ప్రిన్సిపాల్ నిర్మలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తల్లిదండ్రులు శనివారం పాఠశాల ఎదుట ఆందోళన చేసి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీసిన ఘటనపై వార్తా కథనాలు ప్రచురితమవడంతో ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించారు. ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.