హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై ‘ప్రత్యేక బహిరంగ విచారణ’ చేపట్టనున్నట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది. ఈ నెల 28, 29న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కేసులను విచారిస్తామని వెల్లడించింది.
ఈ విచారణకు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్, సభ్యులు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి, విజయ భారతి సయాని హాజరవుతారు. 28న ఉదయం 10 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిర్యాదుదారులు, అధికారుల సమక్షంలో కేసులను విచారిస్తారు.