హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీలో వచ్చేవిద్యాసంవత్సరం నుం చి ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వర్సిటీలో ల్యాట్రల్ ఎంట్రీ ద్వారా విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. దీని ద్వారా విద్యార్థులు బీటెక్‌ను మన దేశంతోపాటు, విదేశాల్లోనూ చదువొచ్చు. ఈ ప్రవేశాల నోటిఫికేషన్‌ను బుధవారం వర్సిటీ అధికారులు విడుదల చేశారు. తొలుత నాలుగు దేశాల విద్యార్థులను ఆర్జీయూకేటీలో చేర్చుకొంటారు. ఆ తర్వాత మిగతా దేశాలకు క్రమంగా విస్తరిస్తారు. ఒక సెమిస్టర్‌ను విదేశీ విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తుండగా, మన విద్యార్థులు కూడా ఆయా విదేశీ వర్సిటీల్లో ఒక సెమిస్టర్ లేదా ఒక సంవత్సరం పూర్తిస్థాయిలో చదువుతారు. ఇలా ఆర్జీయూటీకే అధికారులు బీటెక్‌లో ల్యాట్రల్ ఎంట్రీకి అవకాశం కల్పించారు. అభిరుచుల ప్రకారం బీటెక్ ఫస్టియర్ నుంచే ల్యాట్రల్ ఎంట్రీలో ప్రవేశాలు పొందవచ్చు.
ప్రవేశాల షెడ్యూల్ విడుదల
ఆర్జీయూకేటీలో ఆరేండ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఇన్చార్జి వీసీ వెంకటరమణ విడుదల చేశారు. జూన్ 1న నోటిఫికేషన్ ఇచ్చి, జూలైలో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పీయూసీ కోర్సుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఐవోటీ వంటి కొత్త కోర్సులను తీసుకొచ్చేందుకు ఇంటర్మీ డియట్ బోర్డుతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. బాలికల హాస్టళ్ల సమీపంలోనే ఐటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఇంటిగ్రేటెడ్ మాడ్ర న్ కిచెన్ నిర్మాణానికి జూన్‌లో టెండర్లు పూర్తిచేస్తామని ఆయన వివరించారు.
ప్రవేశాల షెడ్యూల్ వివరాలు