హైదరాబాద్, అక్టోబర్28 (నమ స్తే తెలంగాణ): కులవృత్తిదారుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కృషి చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ సూచించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ ఫై నాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీ కాంత్గౌడ్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించి, బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమావేశమయ్యారు.
బీసీ గురుకులాల్లో మెరుగైన సదుపాయాలు
గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలతో పాటు సమగ్ర వికాస కోసం కృషి చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎంజేపీ రెసిడెన్షియల్ సూ ల్స్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోర్డులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించేలా ప్రస్తుతమున్న రెండు సీఈవోల సంఖ్యను పదికి పెంచుతున్నట్టుగా మంత్రి తెలిపారు.
హాస్టళ్ల నిర్వహణకు రూ.24.52 కోట్లు
హాస్టళ్ల నిర్వహణకు రూ.24.52 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. బడ్జెట్లో 98.10 కోట్లను ప్రతిపాదించగా, ఇప్పటికే 48.25 కోట్లను విడుదల చేసింది.
డ్రైవింగ్ ఎడ్యుకేషన్ తప్పనిసరి
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సం ఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రవాణాశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సో మవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. కొత్తగా లైసెన్సులు పొందేవారికి డ్రైవింగ్ ఎడ్యుకేషన్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించామని, హైదరాబాద్‌లోని 6 రవాణా శాఖ కేంద్రాలతోపాటు ఉ మ్మడి జిల్లాల్లోని 9 కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు.