హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 569 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు సంఖ్య 6,53,202కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,42,413 మంది కోలుకున్నారు. ఇంకా 6,939 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3847 మంది మృతి చెందారు. ఇవాళ 87,230 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.