హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన బాధితుల్లో 482 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,668 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 6,54,758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,42,294 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 3,856కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదినలో వెల్లడించింది.