మహబూబ్‌నగర్, జూలై 17 : మహబూబ్‌నగర్ జిల్లా తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అప్పటికే ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. జూన్ 16న మగ శిశువు జన్మించాడు.
13 నుంచి బాబు కనిపించకపోవడంతో, ఐసీడీఎస్ సీడీపీవో విచారించగా మునిమోక్షం గ్రామానికి చెందిన తరుణ్‌కు రూ.లక్షకు విక్రయించినట్టు తెలిపారు. ఐసీడీఎస్ అధికారులు బాబును శిశుగృహకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, తరుణ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై విజయ్ కుమార్ వెల్లడించారు.