ATM fraud | ఏటీఎంలలో కొత్త తరహా చోరీ.. ప్లాస్టర్ వేసి నగదు కాజేత
ATM fraud | దొంగల రకరకాల మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెర తీస్తూనే ఉన్నారు. తాజాగా ఏటీఎంలలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోగల దస్నాపూర్ ఏటీఎంలో ముగ్గురు దుండగులు నయా తరహా మోసానికి పాల్పడ్డారు.
ATM fraud: దొంగల రకరకాల మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెర తీస్తూనే ఉన్నారు. తాజాగా ఏటీఎంలలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోగల దస్నాపూర్ ఏటీఎంలో ముగ్గురు దుండగులు నయా తరహా మోసానికి పాల్పడ్డారు.
ఏటీఎంలో నగదు బయటకు వచ్చే ప్రదేశంలో ప్లాస్టర్‌ను ఎవరికీ అనుమానం రాకుండా అంటించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన సతీష్ దేశ్పాండె ఆ ఏటీఎంకు వెళ్లి రూ.5 వేలు డ్రా చేశారు. ఎంతకీ నగదు బయటకు రాలేదు. ఆయన ఖాతా నుంచి మాత్రం రూ.5 వేలు డెబిట్ అయినట్లు చరవాణికి సమాచారం వచ్చింది. దీంతో ఆయన బ్యాంకు యాజమాన్యానికి, మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ ఏటీఎంలోని నిఘా కెమెరా సీసీ ఫుటేజీని పరిశీలించగా దుండగులు ప్లాస్టర్ అంటించినట్లు గుర్తించారు. నగదు బయటకు రాకపోవటంతో అక్కడి నుంచి సతీష్ దేశ్పాండె బయటకు వెళ్లిపోయాక దుండగులు వారు అంటించిన ప్లాస్టర్‌ను తొలగించి నగదును తీసుకెళ్లారు. గుర్తు తెలియని ముగ్గురు దుండగులపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్ఐ వంగ విష్ణువర్ధన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

