హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమం ఈ నెల 30న మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుండగా, సంబంధిత అధికారులు, ఉద్యోగులంతా 12 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆదేశించారు.
ఉద్యోగులు తమ గుర్తింపుకార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. బీఆర్కేఆర్ భవన్లోని మూడవ అంతస్తులోగల జీఏ (ఎస్బీ) శాఖ నుంచి వాహనాల పాస్లు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు మింట్ కాంపౌండ్ మార్గంలోని గేటు నుంచి లోనికి ప్రవేశించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది నార్త్-ఈస్ట్ గేటు ద్వారా ప్రవేశించాలని, వారికి అక్కడే పార్కింగ్ సౌకర్యం కూడా ఉన్నట్టు తెలిపారు.