డిగ్రీలో బకెట్ సిస్టమ్‌ను ఏం చేద్దాం ?
డిగ్రీలో బకెట్ సిస్టమ్‌ను ఉంచుదామా? ఎత్తేద్దామా? అని సర్కార్ మల్లగుల్లాలు పడుతున్నది. కొనసాగించడం ద్వారా తలెత్తనున్న సమస్యలు.. తొలగించడం ద్వారా ఎదురయ్యే చిక్కులపై తర్జనభర్జన చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించింది.
- ప్రభుత్వవర్గాల మల్లగుల్లాలు
- కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : డిగ్రీలో బకెట్ సిస్టమ్‌ను ఉంచుదామా? ఎత్తేద్దామా? అని సర్కార్ మల్లగుల్లాలు పడుతున్నది. కొనసాగించడం ద్వారా తలెత్తనున్న సమస్యలు.. తొలగించడం ద్వారా ఎదురయ్యే చిక్కులపై తర్జనభర్జన చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) సమావేశంలో నిర్ణయించింది. ఈ కమిటీ తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు పరిశీలించాలని నిర్దేశించింది. వచ్చే విద్యాసంవత్సరంనాటికి తగిన సూచనలు చేయాలని, సవరణలు సూచించాలని పేర్కొన్నది. అలాగే పీఎంయూ సమావేశంలో రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, విద్యార్థుల హాజరు, డాటా నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ నోటిఫికేషన్‌ను ఇంటర్ ఫలితాల తర్వాత విడుదల చేయాలని నిర్ణయించారు. అన్ని కాలేజీలు విధిగా ఈ విధానాన్ని పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. పాటించిన కాలేజీలకు దోస్త్ కన్వీనర్, ఓయూ వైస్ చాన్స్‌లర్ ద్వారా నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ైస్లెడింగ్ సిస్టం ప్రవేశపెట్టాలని సంకల్పించారు. ప్రభు త్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫేసియల్ రికైగ్నెజేషన్ విధానంలో హాజరు నమోదు, అన్ని విద్యాసంస్థలు కచ్చితంగా హాజరుశాతాన్ని అమలు చేయాలని సంకల్పించారు. టీజీసీహెచ్ఈ చైర్మన్ మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి వినూత్న యూజీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

