హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలోని మల్లంపల్లి నూతన మండల కేంద్రంగా ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మండల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 15 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలను తెలియజేయాలని పేర్కొన్నది. ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధిలోని శ్రీనగర్, భూపాల్నగర్, శివతండా, మహ్మద్గౌస్పల్లి, దేవనగర్, ముద్దునూరుతండా, గుర్తూరుతండాలతోపాటు హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కాట్రపల్లి రెవెన్యూ గ్రామంతోపాటు రాజుపల్లి, సాధనపల్లి, నూర్జాన్పల్లి గ్రామాలు మల్లంపల్లి మండలంలో విలీనం కానున్నా యి.