హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా నూతన దవాఖాన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది చివరిలోగా అందుబాటులోకి వస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శనివారం ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎంబీబీఎస్ విద్యార్థుల 175వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ.. పట్టాలు పొందిన విద్యార్థులు రోగుల బాధను పంచుకొని, వారికి ఉపశమనం కలిగించే పవిత్ర వృత్తిలో ఉన్నామని మర్చిపోవద్దన్నారు. పేషెంట్లతో మానవత్వంతో వ్యవహరించాలని, ధనార్జనే ధ్యేయంగా ఉండకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో కాళోజీ వర్సిటీ వీసీ. డాక్టర్ రమేశ్ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, ఉస్మానియా ప్రిన్సిపల్ రాజారావు పాల్గొన్నారు.