హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల ఉత్పత్తి, సప్లయ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 2 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చెవ్వూరు హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ, దేశీయ లికర్, బీరు కంపెనీలు మద్యం అమ్మకాలు జరుపుకోవడానికి టీజీబీసీఎల్‌కు 39 కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
టీజీబీసీఎల్‌లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో తమ మద్యాన్ని నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్టుగా, ఎలాంటి ఆరోపణలు లేవనే నిర్ధారణ సర్టిఫికేషన్ దరఖాస్తును జత పరచాలని టీజీబీసీఎల్ కోరింది. సర్టిఫికెట్లను జతపరచడం ఆలస్యం అవుతున్నదని, గడువు ఇవ్వాలని కంపెనీలు విజ్ఞప్తి చేశాయి.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నాటుసారాను పూర్తిగా అరికట్టాలని ఎక్సైజ్ సిబ్బందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నా టుసారా ప్రభావం ఉన్న 25 మం డలాల్లో ప్రత్యేక దాడులతో 90% అరికట్టామని, మరో నెలరోజులు స్పెషల్ డ్రైవ్‌చేసి నాటుసారా ఆనవాళ్లు లేకుం డా చేస్తామన్నారు. బుధవారం ఆబ్కా రీ భవన్లో 25 ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బందికి డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరిండెంట్ల సమక్షంలో రివార్డులను అందించారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కోరారు.