హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ స మక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఆయన తో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అరాధేను నియమించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత జస్టిస్ అరాధే ఆరో సీజే. ఇప్పటికే ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.