Traffic Rules | హైదరాబాద్, మే29 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. జూన్ 1నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్ విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.
మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ విధించటంతో పాటు మైనర్‌కు 25ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు. జూన్ 1నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ సూల్కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు.