తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 1217 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా మరో 3944 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26498 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 48434 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.