హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 5135 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదయిన 256 కేసులలో.. 107 కేసులు జీహెచ్ఎంసీ రీజియన్ నుంచి కాగా.. 19 రంగారెడ్డి జిల్లా, 17 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, 12 నల్గొండ, 10 ఖమ్మం జిల్లా నుంచి నమోదయ్యాయి. ఇవాళ అధికారులు 25341 కరోనా టెస్టులు చేశారు. 767 మంది బాధితులు తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు.