హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 683 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి తాజాగా మరో 2645 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13674 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 52714 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.