హైదరాబాద్: ఇవాళ రాత్రి 8 గంటలకే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశమై కొత్త సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించింది. ఆ మేరకు ఏక వాక్య తీర్మానం చేసి పంపింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ మరికాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది. సీఎల్పీ నేత ఎవరనే విషయాన్ని స్పష్టం చేయనుంది.
హైకమాండ్ నిర్ణయం వెలువడగానే ఈ రాత్రి 8 గంటలకే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్‌లో 300 మంది కూర్చునేలా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రమాణస్వీకారానికి హైకమాండ్‌కు చెందిన ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.