బండి సంజయ్‌పై నెటిజన్ల ఆగ్రహం
బాలికపై తన కుమారుడు బండి భగీరథ్ చేసిన అఘాయిత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న జిమ్మిక్కులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
- కొడుకును వదిలి బాధితులపై కక్ష సాధింపా?
- రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్
- మహిళా లోకానికి ఇచ్చే గౌరవం ఇదేనా?
- సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న జనం
కరీంనగర్, మే 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్ సిటీబ్యూరో(నమస్తే తెలంగాణ): బాలికపై తన కుమారుడు బండి భగీరథ్ చేసిన అఘాయిత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న జిమ్మిక్కులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బాధిత కుటుంబంపై కేసు పెట్టి వారిపై కక్షసాధింపు చర్యలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. తన కుమారుడిని మందలించాల్సింది పోయి.. తనపైనే కక్ష చేస్తున్నారని అంటూ బండి సంజయ్ గొంతు చించుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశ శాంతిభద్రతలను పరిరక్షిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తన ఇంటి వరకు వచ్చేసరికి చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘భారత్ మాతాకీ జై’ అంటూ వేదికలపై మహిళాభక్తిని చాటుకొనే నేత సొంత కొడుకు.. ఒక ఆడబిడ్డ జీవితంతో ఆడుకుంటా ఆమెకు నరకం చూపించారని ప్రజలు మండిపడుతున్నారు.
పైగా పోక్సో కేసు నేపథ్యంలో బండి సంజయ్ ఈ నెల 9న తన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన పోస్టుపైనా మెజారిటీ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కొడుకుపై పోక్సో కేసు నమోదైతే ఏ ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ వద్దకు వెళ్తావు. ఏమాత్రం శరం ఉన్నా.. వెంటనే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని నెటిజన్లు డిమాండ్ చేశారు. కేంద్రానికి ఏమాత్రం చిత్తుశుద్ధి ఉన్నా బండిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదంతా ఎందుకు తడి బట్టలతో భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడిలో ప్రమాణం చేయి. నీ కొడుక్కి ఏమీ తెలియదు’ అని ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘అన్నా.. ఈ రోజు ఏ వారం అన్నా.. అపర ‘భగీరథు’డు దొరికేశాడు! అంటూ ఇంకొకరు పోస్టు పెట్టారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పావుగా.. మరి నీ కొడుకు సుద్దపూసనా అంటూ ప్రశ్నించారు. ‘అందులో ఎటువంటి కుట్రలు లేవు.. నీ కొడుకు తప్పు చేశాడు. అది దేశం మొత్తం తెలిసిపోయింది. ఇంకా వెనుకొస్తే ఎలా?’ అంటూ ఒకరు పోస్టు పెట్టారు. ‘ముందునుంచీ సాయి భగీరథ్ చాలా చక్కని అబ్బాయి. ఎవరినీ తిట్టడు. కొట్టడు. నోట్లో వేలు పెట్టినా కొరకుడు’ అంటూ మరొకరు వ్యంగంగా పెట్టారు. ‘బీసీలు అన్యాయంగా బలైనప్పుడు నీ బీసీవాదం ఎక్కడపోయింది బాస్’ అంటూ ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

