హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘ఒక్క కేసీఆర్.. ఎన్నో అద్భుతా లు’ అనే యాష్టాగ్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నది. సచివాలయం ప్రారంభోత్సవం అనుభూతులు, దృశ్యాలు, డ్రోన్ల వీడియోలను నెటిజన్లు సా మాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. సచివాలయాన్ని చూస్తుంటే.. హైదరాబాద్ నడిబొడ్డున కేసీఆర్ నిల్చొన్నంత ధైర్యంగా ఉన్నదని ట్వీట్లు చేశారు.
‘థింక్ బిగ్ లైక్ కేసీఆర్-డ్రీమ్ బిగ్ లైక్ కేసీఆర్’ లక్ష్యం పెద్దగా ఉండాలి.. ఆలోచన గొప్పగా ఉండాలి.. అటువంటి వ్యక్తి కేసీఆర్.. అంటూ వివిధ పథకాల ఫొటోలను జతచేస్తూ పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి చిహ్నా లు ఇవేనంటూ ప్రతిపక్షాలకు నెటిజన్లు కౌంటర్లు ఇవ్వడం విశేషం. కాషా య పార్టీని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ‘ఆహ్వానించకుంటే ఏడుపే.. ఆహ్వానించినా ఏడుపే.. గుజరాతోళ్ల చెప్పులు మోసే వీళ్లకి అసలు తెలంగాణ అంటేనే ఏడు పు. అంబేద్కర్ పేరు పెట్టడం ఇంకా ఏడుపే’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రారంభోత్సవాన్ని టీవీల్లో వీక్షిస్తూ నగరవాసులు సంబురాలు చేసుకున్నారు.