హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ పేరుతో రాజకీయంగా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్’ అంటూ ఆదివారం సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు వెల్లువెత్తాయి. ఎక్స్, ఇ న్స్టా, ఫేస్బుక్, వాట్సాప్‌లలో తమ ఒపీనియన్లు పంచుకున్నారు.
కేసీఆర్‌ను విచారించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నరేశ్ అనే నెటిజన్ పోస్టు చేయగా, పోలీసుల దిగ్బంధానికి గులాబీ సైనికులు భయపడరంటూ ప్రకాశ్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టుచేశాడు. కేసీఆర్ పోరాడకపోతే తెలంగాణ వచ్చేదే కాదని నవీన్‌కుమార్ అనే నెటిజన్ పోస్టు పెట్టగా, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని జగన్ అనే వ్యక్తి హెచ్చరించాడు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాస్తారోకోలు, సీఎం ది ష్టిబొమ్మ దహనం, బైక్ ర్యాలీలో గులాబీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్న ఫొ టోలను షేర్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధిని కండ్లకు కట్టినట్టుగా వీడియోలు రూపొందించారు. ఆ వీడియోలకు వేలాది మంది నెటిజన్లు జై కేసీఆర్ అంటూ కామెంట్లు చేశారు.