Revanth Reddy | సీఎం గారూ.. ఈ దుబారా ఖర్చులేంది?.. గ్లోబల్’షో ఖర్చులపై నెటిజన్ల నిలదీత
Revanth Reddy | ‘ఖజానా ఖాళీ అయ్యింది.. నన్ను కోసినా రూపాయి లేదు’ అంటూనే ఈ దుబారా ఖర్చులేమిటంటూ ప్రముఖ నెటిజన్ నాయిని శరత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సూటిగా నిలదీశారు. ‘ఆరు గ్యారెంటీలు అమలుచేయమంటే పైసల్లేవు అంటావు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖజానాలో నిధుల్లేవు అంటావు.
Revanth Reddy | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ‘ఖజానా ఖాళీ అయ్యింది.. నన్ను కోసినా రూపాయి లేదు’ అంటూనే ఈ దుబారా ఖర్చులేమిటంటూ ప్రముఖ నెటిజన్ నాయిని శరత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సూటిగా నిలదీశారు.
‘ఆరు గ్యారెంటీలు అమలుచేయమంటే పైసల్లేవు అంటావు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖజానాలో నిధుల్లేవు అంటావు. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఊరంతా జెండాలు కట్టడానికి ఈ ఐదున్నర కోట్లు ఎకడినుంచి వచ్చాయి సీఎం గారు? ఇవేమైనా మీ ఇంటి నుంచి తెచ్చిపెడుతున్నారా?’ అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, బీచ్ ప్లాగ్, తాత్కాలిక స్టాళ్లు, ఎల్ఈడీ డిస్ప్లే కోసం కోట్లలో ఖర్చు చేసిన టెండర్ డాక్యుమెంట్లను గురువారం ఎక్స్‌వేదికగా ఆయన పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో మాత్రం రాష్ట్రానికి నయా పైసా లాభం చేకూర్చని ‘గ్లోబల్ సమ్మిట్’కు అక్షరాలా రూ.5 కోట్ల 58 లక్షలు ఖర్చుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రభుత్వ తీరు ఎలా ఉం దంటే.. ఇంట్లో తినడానికి మెతుకుల్లేకపోయినా, వీధిలో ఊరేగింపు కోసం పట్టు వస్త్రాలు అప్పు తెచ్చుకున్నట్టుగా ఉన్నది’ అని మరికొందరు ఎద్దేవాచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

