రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నేతన్నలు చేపట్టిన రిలే దీక్షలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన దీక్షలను శనివారం పాలిస్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దూడం రమేశ్ ప్రారంభించారు. దీక్షలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉడుత రవి, జిందం మహేశ్, మరిపెద్ది ప్రభాకర్, జిందం రవి, చందుపట్ల పోశమల్లు, బొచ్చు రాంచంద్రం, మంగళారపు లక్ష్మీనారాయణ, జిందం దేవదాస్ పాల్గొన్నారు.