హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నీట్ పీజీ దరఖాస్తులో తప్పుల సవరణకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అవకాశం ఇచ్చింది.
సోమవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 11:55 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని సూచించింది. ఈ సమయంలో కొత్త దరఖాస్తులకు లేదా ఫీజు చెల్లింపులకు అవకాశం లేదని స్పష్టంచేసింది.