హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్లలో ఆలిండియా కోటా భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొదటి విడత కౌన్సెలింగ్కు 15 నుంచి 23 వరకు రిజిస్ట్రేషన్లు, 17 నుంచి 23 వరకు వెబ్ఆప్షన్లు, 24, 25 సీట్ల కేటాయిం పు, 26న ఫలితాలు, 27 నుంచి ఆగస్టు 1లోపు ప్రవేశాలు, ఆగస్టు 2 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 30 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ ముగించాలని ఎన్ఎంసీ గతంలో నిర్ణయించింది. ఈ మేరకు గడువులోపు మొదటి, రెండో, మాపప్, స్ట్రే వేకెన్సీ రౌండ్లు ముగించనున్నట్టు వివరించారు. వివరాలకు ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.