హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ 2023 పరీక్ష అడ్మిట్ కార్డులను తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న 499 నగరాలు, పట్టణాల్లో నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఏ తెలిపింది.
తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష ఉంటున్నదని పేర్కొన్నది. పరీక్షకు నిరుడు 17.64 లక్షల మంది విద్యార్థులు రాగా, ఈసారి 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.