హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీరాకేఫ్ వేలాన్ని పర్యాటకశాఖ తక్షణమే నిలివేయాలని గౌడజన హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యెలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నీరా కేంద్రాన్ని వేలం వేయకుండా.. గౌడకులానికి అప్పగించాలని కోరారు. ఈ డిమాండ్‌తో ఉద్యమిద్దామని బుధవారం ఒక ప్రకటనలో గౌడ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.