హైదరాబాద్, జూలై 28: సంక్షోభంలో పడిన పౌల్ట్రీరంగాన్ని ఆదుకోవాలంటూ నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ), తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీపీఎఫ్) ప్రతినిధులు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించారు. మొక్కజొన్న సహా ఇతర దాణా రేట్లు పెరగడంతో పౌల్ట్రీరంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రభుత్వం తరఫున కోళ్లదాణాపై రాయితీ ఇవ్వడం ద్వారా ఈ రంగాన్ని ఆదుకోవాలని కోరారు. సీఎంను కలిసిన వా రిలో టీపీఎఫ్ అధ్యక్షుడు కాసర్ల మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉడుతల భాస్కర్‌రావు, ఉపాధ్యక్షుడు ఉప్పల నర్సింహారెడ్డి, ఎన్ఈసీసీ(హైదరాబాద్) చైర్మన్ గుర్రం చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వంగేటి బాలకృష్ణారెడ్డి, ఈసీ సభ్యుడు జక్క సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.