(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రచ్చ చేయాలని ఒత్తిడి చేయడంతో ఎన్డీటీవీ ముంబై బ్యూరో చీఫ్ సోహిత్ మిశ్రా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ ఆప్తుడు అదానీకి చెందిన ఎఎంజీ మీడియా ఎన్డీటీవీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం అదానీ తన దిగజారిన ప్రతిష్టను కాపాడుకోవటానికి దేశీయ మీడియాను నియంత్రించటానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గత ఆగస్టు31న ముంబైలో అదానీపై విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి అంతరాయం కల్పించి, రచ్చ చేయాలని ఎన్డీటీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ తనపై ఒత్తిడి తెచ్చినట్లు సోహిత్ ఆరోపించారు.