హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : రా్రష్ట్రంలో విద్యార్థుల మరణాలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సీరియస్ అయ్యింది. విద్యార్థులకు కల్తీ ఆహారం అందించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
గురుకులాలు, సర్కారు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థుల మరణం, 886 మంది అస్వస్థతకు గురికావడంపై న్యాయయవాది కొండా సాయిప్రసాద్‌గౌడ్ ఎన్సీపీసీఆర్కు పలు పత్రికా కథనాలు జోడించి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. స్పందించిన కమిషన్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది. మరణాలపై 15 రోజుల్లో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.