హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో ఎన్సీపీకి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు శరపరంపరగా కొనసాగుతున్నా యి. ఈనెల 24న బీఆర్ఎస్ ఔరంగాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు ముందే ఎన్సీపీకి చెందిన జడ్పీ చైర్మన్, ఉపాధ్యక్షుడు సహా పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరటం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నాందేడ్ సమావేశం, కంధార్-లోహా బహిరంగ సభలకు ముందు నుంచే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వందల మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఆప్ పార్టీల నుంచే కాకుండా శంబాజీ బ్రిగేడ్, షేత్కరీ సంఘటన్ సహ పలు సామాజిక సేవా సంఘాల నుంచి చేరికల పరంపర కొనసాగుతున్నది. బుధవారం బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరినవారిలో ఎన్సీపీ ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబా ద్ ఎన్సీపీ ఉపాధ్యక్షుడు రణ్వాసింగ్, విదర్భ షేత్కరీ సంఘటన్ అధ్యక్షుడు జగదీశ్ పాండే, మహారాష్ట్ర అన్నదాత షేత్కరీ సంఘటన్ అధ్యక్షుడు జయాజీరావు సూర్య వంశీ, పోలంబరీ ఎన్సీపీ ఉపాధ్యక్షుడు త్రయంబక్ మడ్గే, జగదీశ్ బోండే, కాశీనాథ్ ఫుటానే, కుల్దీప్ బోండే, స్వప్నిల్ వాకోడే, నందకిషోర్ ఖేర్డే, రిషబ్ వా కోడే, విజయ్ విల్హేకర్, సంజయ్ తైడే, అజయ్ దేశ్‌ముఖ్, అరుణ్ సాకోరే , సునీల్ షేరేవార్, ప్రమోద్ వాంఖడే, సునీల్ పడోలె, ప్రవీణ్కోల్హే, జ్ఞానేశ్వర్గాడే, గజానన్భగత్, అమోల్ జాద వ్, సంజయ్ భురటే, భీమ్రావ్ కొరాడర్, సతీశ్ అగర్వాల్, జేడీ పాటిల్, గజానన్ దేవకే, సంజయ్ భర్సక్లే, సునీల్ సాబల్, సుశీల్ కచ్వే, మహేంద్ర గవాండే, గులాబ్ చవాన్, ఎన్డీ బ్ర హ్మాంకర్, ప్రమోద్ వాంఖడే, పురుషోత్తం ధోటే, కుమార్ సోమవంశీ, విజయ్ లాజురర్, అంకుష్ మాకోడే, సాగర్ గవాండే, సుధాకర్ తేటే తదితరులున్నారు. వివిధ రంగాల నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
26న బీఆర్ఎస్లోకి.. బాల్క సుమన్‌తో సంసిద్ధత తెలిపిన నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రగతి దార్శనికతకు దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ దక్కుతున్నది. చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రముఖ సీనియర్ నాయకులు, ప్రజల్లో బలమైన ప ట్టున్న పలు జాతీయ పార్టీల మరాఠీ నాయకులు వరుసగా మూకుమ్మడిగా సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ జెండాను కప్పుకుంటున్నారు. తాము అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలకు చెందిన, పలు రంగాల నేతలు, విద్యాధికు లు, నిపుణులు ఈనెల 26న తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే విప్ బాల సుమన్‌తో వారు బుధవారం సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ వెంట కలిసి నడవడానికి సిద్ధమని వారు తమ సంసిద్ధతను ప్రకటించారు. ఈ సం దర్భంగా చంద్రపూర్ జిల్లాలోని మహంకాళీ అమ్మవారిని దర్శించుకొన్న బాల్క సుమన్.. అక్కడ పూజలు నిర్వహించారు. సుమన్ వెంట మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ ఉన్నారు.