హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ): కాంగ్రెస్ మరోమారు వలస నేతనే నమ్ముకున్నది. పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లను కాదని పారాచూట్ నేతకే జూబ్లీహిల్స్ టికెట్ ప్రకటించింది.
ఈ మేరకు నవీన్‌యాదవ్ పేరును ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. నవీన్‌యాదవ్‌పై ఓటర్ కార్డుల పంపిణీ కేసు ఉన్నప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఆయనకే టికెట్ కేటాయించడంపై పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతున్నది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీపడిన అజారుద్దీన్, అంజన్‌కుమార్‌యాదవ్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరికి వలస నేత అయిన నవీన్‌నే టికెట్ వరించింది.