హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపు మేరకు లండన్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్‌ను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టాక్ నాయకుడు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ సంతోష్‌కుమార్ చేస్తున్న వృక్ష మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలందరూ ఈనెల 17న జరిగే వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్‌కు పుట్టినరోజు కానుకను ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై యూకే, టాక్ నేతలు సుప్రజ, రవి రేతినేని, రవి పులుసు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.