Actor Navdeep | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ నెట్‌వర్క్‌లో ఎక్కువగా ఈవెంట్ నిర్వాహకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడి స్నేహితులు కూడా ఉన్నట్టు తేల్చారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీనాబ్) పోలీసులు నవదీప్‌ను విచారించి 81 మంది పేర్లను గుర్తించారు. అందులో 45 మంది అనుమానితుల వివరాలను సేకరించారు. టీనాబ్ ముందు నేడో, రేపో సినీ డైరెక్టర్ ఉప్పలపాటి రవి, ఈవెంట్స్ నిర్వాహకుడు కలహార్‌రెడ్డి, స్నార్ట్ పబ్ నిర్వాహకుడు సూర్య హాజరుకానున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ఈ ముగ్గురు పోలీసుల ముందు లొంగిపోయి, నోటీసులు తీసుకోవాలి. నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. డ్రగ్స్‌తో సంబంధాలున్న వారిలో గుబులు మొదలువుతున్నది.