హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ-టీఎస్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఫారెస్ట్ ట్రెక్పార్క్లో శని, ఆదివారాలలో నేచర్ క్యాంప్ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ట్రెక్పార్క్లో శనివారం సాయంత్రం 4 నుంచి ఆదివారం ఉదయం 9.30 వరకు క్యాంప్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, రాత్రి అడవిలో నడక, నైట్ క్యాంపింగ్, క్యాంప్‌ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ ఉంటాయని తెలిపారు. క్యాంప్‌లో పాల్గొనే వారికి శనివారం సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తామని చెప్పారు. ‘బోటానికల్ గార్డెన్లో బర్డ్‌వాక్’ నిర్వహిస్తామని ఎకోటూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్‌నాయక్ వెల్లడించారు.