హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేస్తారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.