కొడంగల్, నవంబర్ 17 : లగచర్ల గ్రామాన్ని సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జలోతు హుస్సేన్ సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన హైదరాబాద్లో బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు గ్రామస్థులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి బాధితులను కలువనున్నారు.
సీఎం ఇలాకాలోనే రక్షణ కరువు
హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోనే పేదలకు రక్షణ లేకుండా పోయిందని ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి. లగచర్ల బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి.