యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ నెల 12న జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఈ నెల 22న గురుకుల పాఠశాలను కమిషన్ బృందం సందర్శించనున్నది. గురుకులంలో కలుషిత ఆహారం తీసుకొని 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ఓ విద్యార్థి ఈ నెల 16న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం గురుకుల పాఠశాలలో పరిస్థితులను పరిశీలించి, కేంద్రానికి నివేదిక అందించనున్నది.