హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర హోం మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం శాలిబండ పోలీస్స్టేషన్ దేశంలోనే 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైనట్లు డీజీపీ జితేందర్ శుక్రవారం తెలిపారు. భువనేశ్వర్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక డీజీపీ, ఐజీపీల కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించినట్లు చెప్పారు. ఇది తెలంగాణ పోలీస్ వ్యవస్థకు మరింత గుర్తింపు, ప్రతిష్టను తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్, శాలిబండ పోలీస్స్టేషన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజల భద్రత, ఆదర్శప్రాయమైన సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులు తమ అంకితభావాన్ని చాటుతున్నారనేందుకు ఇది నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు.