త్వరలో దళిత కాంక్లేవ్: ముఖ్యమంత్రి కేసీఆర్
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..
- సీఎంను కలిసిన పలు రాష్ట్రాల నేతలు..
- తెలంగాణ దళితాభివృద్ధి పథకాలు భేష్..
- తమిళ ఎంపీ తిరుమావళవన్ ప్రశంస
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్లో దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు తమిళనాడు ఎంపీ తిరుమావళవన్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తిరుమావళవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని, దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని అభినందించారు. సీఎం కేసీఆర్ను కలిసినవారిలో వివిధ రాష్ర్టాల రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిశా), సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ (ఢిల్లీ), సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్ (హర్యానా), మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- Dalit conclave
- KCR
- Launch
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

