కొడంగల్, నవంబర్ 25: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారుల విచారణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ లా ముఖేష్, కమిషన్ సభ్యులు రోహిత్ సింగ్, ప్రకాశ్‌శర్మ సోమవారం పట్టణంలోని ‘కడా’ కార్యాలయాన్ని సందర్శించారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో సమావేశమై లగచర్ల ఘటన వివరాలను సేకరించారు. ఈ నెల 11న ఏం జరిగింది?, ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు.
బావర్చి బిర్యానీలో సిగరెట్
చిక్కడపల్లి, నవంబర్ 25: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి రెస్టారెంట్ బిర్యానీలో సిగరెట్ ముక్క వచ్చిందంటూ కస్టమర్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. బావర్చిలో రెస్టారెంట్ బిర్యానీలో గతంలో ఎలుక, బల్లి వచ్చినట్టు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు సిగిరెట్ ముక్క రావడం కలకలం రేపింది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై స్థానిక పీఎస్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తున్నది. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేసి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని బిర్యానీప్రియులు కోరుతున్నారు.