హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్’ కార్యక్రమంతో తెలంగాణ, ఈశాన్య రాష్ర్టాల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక బంధం బలోపేతం కానున్నట్టు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్’ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. శాస్త్రసాంకేతిక రంగాల్లో అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఫ్యూచర్ సిటీలో మొట్టమొదటి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని నిర్మించేందుకు భూమి కేటాయిస్తామని ప్రకటించారు.
పాదరక్షల వారసత్వంపై గచ్చిబౌలిలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)లో ఈనెల 28నుంచి 30 వరకు జాతీయ సదస్సు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, ఎఫ్‌డీడీఐ ప్రతినిధులు తెలిపారు. గురువారం ఈ సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28న ఉదయం 11గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించనున్నట్టు తెలిపారు.