హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ లైంగికదాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ డీజీపీ రవిగుప్తా నుంచి నివేదిక కోరింది. బాధితురాలికి పరిహారం, ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు 26 ఏళ్ల తమ సహోద్యోగికి మత్తు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. నిందితులు సంగారెడ్డి , జనార్దన్‌రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.