Minister Sridharbabu | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్‌ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నాస్కాం భాగస్వామి కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. బుధవారం సచివాలయంలో ఆయన నాసాం అధ్యక్షుడు రాజేశ్ నంబియార్‌తో పలు విషయాలపై చర్చించారు.
కృత్రిమ మేధస్సు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ ఉద్యోగులకు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడంలో నాసాం కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. హైదరాబాద్ జీసీసీల గమ్యస్థానంగా మారిందని, కొత్త సంస్థలు ఇకడ అడుగుపెట్టేందుకు నాసాం తన పలుకుబడిని ఉపయోగించాలని కోరారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో రాష్ట్ర ఐటీ రంగం దేశంలోనే అగ్రగామిగా వృద్ధి చెందుతుందన్నారు.