హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఫుడ్పాయిజన్ ఘటనలో సస్పెండైన నారాయణపేట డీఈవో మహ్మద్ అబ్దుల్ ఘనీకి ప్రభుత్వం తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. ఆయనకు వనపర్తి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలప్పగించింది.
ఫుడ్పాయిజన్ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం అబ్దుల్ ఘనీని సస్పెండ్ చేసింది. గురువారం సస్పెండ్ చేయగా, శుక్రవారం వనపర్తి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతప్పగించింది. మరో విశేషమేమిటంటే ఆయనకు జోగులాంబ గద్వాల జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.