హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు మరోసారి టాప్ ర్యాంకులు కైవసం సత్తా చాటారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు. టాప్-10లో ఐదు ర్యాంకులు సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో మాజిద్ హెస్సేన్ 3వ ర్యాంకు (హాల్టికెట్ నంబర్ 251134112), పార్థ మందర్ వార్థక్ 4వ ర్యాంకు (హెచ్టీ నం. 251110752), అక్షత్ చౌరాసియా 6వ ర్యాంకు (హెచ్టీ నం.254065055), సాహిల్ డియో 7వ ర్యాంకు (హెచ్టీ నం.251113172), వడ్లమూడి లోకేశ్ 10వ ర్యాంకు (హెచ్టీ నం.256061276) సాధించినట్టు వివరించారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీ టాప్-50లో 23 ర్యాంకులు, టాప్-100లో 43 ర్యాంకులను కైవసం చేసుకొని ‘నారాయణ’ విద్యార్థులు విజయభేరి మోగించారని పేర్కొంటూ.. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.