హైదరాబాద్ ఏప్రిల్19, (నమస్తే తెలంగాణ): జేఈఈ-మెయిన్ 2025 ఫలితాల్లో టాప్ ర్యాంకులతో నారాయణ విద్యార్థులు సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ, రమా నారాయణ అన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 1, 9, 10 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో బనిబ్రత మాజీ (హెచ్‌టీ నెం. 250310746461) 1వ ర్యాంకు, టీ శివన్ వికాస్ (హెచ్‌టీ నెం. 250310391420) 9వ ర్యాంకు, సౌరబ్ (హెచ్‌టీ నెం. 250310254844) 12వ ర్యాంకు, ఆర్చిస్మాన్ నంది (హెచ్‌టీ నెం. 250310013515)13వ ర్యాంకు, సన్నధ్య షరాఫ్ (హెచ్‌టీ నెం. 250310296087) 19వ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ (హెచ్‌టీ నెం. 250310009213)20వ ర్యాంకు కైవసం చేసుకున్నారని వివరించారు.
అలాగే ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 1,9, 12,19,20,21,22,24,25,26,36,36,45,47,59,60,67,67,80,81,86,87,95 వంటి టాప్ ర్యాంకులతోపాటు 1000లోపు 165 ర్యాంకులతో నారాయణ విజయ దుందుభి మోగించినట్టు తెలిపారు. గత ఆరేండ్లుగా ఓపెన్ క్యాటగిరీలో మూడుసార్లు (2020,2021,2025) ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం నారాయణ కమిట్మెంట్కు నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 24 మంది ఉండగా, వారిలో 8మంది (33%) నారాయణ విద్యార్థులు కావడం గర్వకారణమని అన్నారు. 10 రాష్ర్టాల్లో నారాయణ విద్యార్థులే టాపర్స్‌గా నిలవడం నారాయణ ఘనతకు నిదర్శనమని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్ కలలను సాకారం చేయడంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరని, పోటీరారని మరోసారి నిరూపించారని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 14.75 లక్షలమంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాయగా, వీరిలో సామాజిక వర్గాలవారీగా, రిజర్వేషన్లకు అనుగుణంగా కేవలం 2.50 లక్షలమంది విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత కల్పిస్తారని తెలిపారు.
ఈ పరీక్షా ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. నారాయణ అందించే అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, పటిష్ట ప్రణాళిక, స్టడీమెటీరియల్, నిబద్ధతతో కూడిన వారంతపు పరీక్ష వల్లే ఈ ఘనత సాధ్యమైందని తేల్చిచెప్పారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా ఎన్-లెర్న్ యాప్‌ను రూపొందించడం జరిగిందని వివరించారు. వీటి ద్వారా ప్రతీ క్యాంపస్‌లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దునట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 300/300 మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఒకరు తెలుగు రాష్ర్టాలకు చెందిన నారాయణ విద్యార్థి కావడం అభినందనీయమని అన్నారు. అందుకే ఐఐటీకి కేరాఫ్ అడ్రస్ నారాయణే అని నిరూపించామని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.